- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితుల కారణంగా భారత్‌లో వంట గ్యాస్‌తో పాటు వంట నూనెల ధరలు కూడా పెరిగాయి. కేజీపై సన్‌ఫ్లవర్ ఆయిల్ ₹4, పామ్ ఆయిల్ ₹2.50, గ్రౌండ్‌నట్ ఆయిల్ ₹2, సోయాబీన్, వనస్పతి ఆయిల్ ₹1 చొప్పున పెరిగాయి. దేశంలో ఉపయోగించే వెజిటబుల్ ఆయిల్స్‌లో దాదాపు 90% అంతర్జాతీయ మార్కెట్ నుంచి దిగుమతి చేసుకోవడంతో ధరలు పెరిగాయని నిపుణులు చెప్తున్నారు. యుద్ధం ఇలానే కొనసాగితే ఆయిల్ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.
- Advertisement -



