Wednesday, April 1, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంప‌శ్చిమాసియాలో యుద్ధం..త‌మ‌పై తీవ్ర ప్ర‌భావం: బ్రిటన్‌

ప‌శ్చిమాసియాలో యుద్ధం..త‌మ‌పై తీవ్ర ప్ర‌భావం: బ్రిటన్‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: ఇరాన్‌ యుద్ధం భవిష్యత్తులో తమ దేశంపై తీవ్ర ప్రభావం చూపుతుందని బ్రిటన్‌ ప్రధాని స్టార్మర్‌ హెచ్చరించారు. అలాగే యుద్ధం వల్ల సంభవించే ఆర్థిక పర్యవసానాలను తట్టుకోవడానికి బ్రిటన్‌ సిద్ధంగా ఉందని, ఈ తుఫాను ఎంత భయంకరమైనదైనా, దాన్ని తట్టుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కూడా ఆయన నొక్కి చెప్పారు. ఇది మా యుద్ధం కాదు అని ఆయన అన్నారు. కానీ అది వారి జాతీయ ప్రయోజనాలకు విరుద్ధమని, ఇందులో తాము జోక్యం చేసుకోబోమని ప్రధాని పునరుద్ఘాటించారు. బ్రిటన్‌లో జీవన వ్యయం విపరీతంగా పెరగడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. బ్రిటన్‌లో జీవన వ్యయం తగ్గాలంటే.. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలను తగ్గించడానికి ఒత్తిడి తేవడమేనని ఆయన అన్నారు. అందుకుతగ్గట్టుగా తమకు అందుబాటులో ఉన్న ప్రతి దౌత్య మార్గాన్ని అన్వేషిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -