Saturday, May 10, 2025
Homeజాతీయంయుద్ధం పరిష్కారం కాదు..

యుద్ధం పరిష్కారం కాదు..

- Advertisement -

నవతెలంగాణ – న్యూఢిల్లీ : ఏ సమస్యకు యుద్ధం పరిష్కారం కాదని, దౌత్య మార్గాల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని ఆల్‌ ఇండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డ్‌ (ఎఐఎంపిఎల్‌బి) శుక్రవారం పేర్కొంది. భారత్‌-పాక్‌ సరిహద్దుల్లో పెరుగుతున్న ఉద్రిక్తతపై బోర్డు ఆందోళన వ్యక్తం చేసింది. ఉగ్రవాదం మరియు అమాయక పౌరుల హత్య తీవ్ర ఆందోళన కలిగించే అంశమని పేర్కొంది. ఇస్లామిక్‌ బోధనలలో, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన గ్రంధాలలో , మానవ విలువలలో ఉగ్రవాదానికి స్థానం లేదని పేర్కొంది. ఇరు దేశాలు ద్వైపాక్షిక చర్చలు, ఇతర దౌత్య మార్గాల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని స్పష్టం చేసింది. యుద్ధం ఏ సమస్యకు పరిష్కారం కాదన్నది కూడా వాస్తవమని పేర్కొంది. దేశం, ప్రజల రక్షణ మరియు వారి రక్షణ కోసం తీసుకునే ప్రతి చర్యకు ఎఐఎంపిఎల్‌బి మద్దతు ఇస్తుందని ప్రకటించింది. క్లిష్టమైన సమయాల్లో ప్రజలు, రాజకీయ పార్టీలు, సాయుధ దళాలు మరియు ప్రభుత్వం కలిసి రావాలని స్పష్టం చేసినట్లు బోర్డు పేర్కొంది. భారత్‌, పాకిస్తాన్‌ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలపై ఎఐఎంపిఎల్‌బి ఒక తీర్మానాన్ని ఆమోదించింది. గురువారం జరిగిన ఆఫీస్‌ బేరర్ల ప్రత్యేక ఆన్‌లైన్‌ సమావేశంలో ఈ తీర్మానాన్ని ఆమోదించినట్లు తెలిపింది. తమ ‘సేవ్‌ వక్ఫ్‌ క్యాంపెయిన్‌’ను యథావిథిగా కొనసాగిస్తామని, అయితే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా బహిరంగ సమావేశాలు , కార్యక్రమాలను మే 16 వరకు వాయిదా వేస్తున్నట్లు తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -