Friday, January 2, 2026
E-PAPER
Homeతాజా వార్తలునీటివాటాపై మాట‌ల యుద్ధం.. సీఎం రేవంత్‌రెడ్డిపై హారీష్ రావు కీల‌క వ్యాఖ్య‌లు

నీటివాటాపై మాట‌ల యుద్ధం.. సీఎం రేవంత్‌రెడ్డిపై హారీష్ రావు కీల‌క వ్యాఖ్య‌లు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: అసెంబ్లీ స‌మావేశాల నేప‌థ్యంలో రాష్ట్రంలో ఒక్క‌సారిగా రాజ‌కీయాలు వేడేక్కాయి. అధికార, ప్ర‌తిప‌క్ష బీఆర్ ఎస్ ల మ‌ధ్య మాట‌ల యుద్దం న‌డుస్తోంది. కృష్టా జ‌లాల వాటాపై రేవంత్ స‌ర్కార్ హ‌యాంలో జ‌ల‌దోపీడీ జ‌రుగుతోంద‌ని బీఆర్ ఎస్ ఆరోపిస్తుండ‌గా, ప‌దేండ్ల కేసీఆర్ పాల‌న‌లోనే జ‌ల‌దోపీడీ జ‌రిగింద‌ని రేవంత్ టీం కౌంట‌ర్ ఇస్తోంది. తాజాగా అసెంబ్లీ స‌మావేశాల్లో కృష్టా జలాల వాటాపై అధికార పార్టీ ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జేటేష‌న్ ఇవ్వాల‌ని నిర్ణ‌యించింది. ఈ సంద‌ర్భంగా త‌మ‌కు మాట్లాడే ఛాన్స్ ఇవ్వాల‌ని ప్ర‌తిప‌క్ష నాయ‌కులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో అనుమ‌తి మంజూరు కాకపోవ‌డంతో అసెంబ్లీ స‌మావేశాల‌ను బ‌హ్క‌రిస్తున్న‌ట్లు మాజీ మంత్రి హారీష్ రావు వెల్ల‌డించారు.

ప్ర‌జాస్వామ్య రీతిలో నిబంధనలు లేకుండా సభను నడుపుతున్నారని ఆరోపించారు. బీఏసీలో మాట్లాడిన మాటలు, తీసుకున్న నిర్ణయాలు వేరు అసెంబ్లీలో పెట్టినవి వేరు.. బీఏసీలో తీసుకున్న నిర్ణయాలు పెట్టకుండా సభను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. అసెంబ్లీని సీఎం బూతులమయం చేశాడని ఎద్దేవా చేశారు. ఇలా మాట్లాడిన స్పీకర్ ఆయనకి అడ్డు చెప్పలేదు.. బీఆర్ఎస్ కి సభలో మాట్లాడే అవకాశం ఇవ్వకపోతే ఇక సభకు ఎందుకు రావాలని హరీష్ రావు ప్రశ్నించారు. మూసీకి సంబంధించి కొన్ని ప్రశ్నలను సభలో సందించాం.. వాటిపై సమాధానాలు ఇవ్వకుండా సీఎం మాట్లాడుతున్నారు.. మూసీ కంటే ముఖ్యమంత్రి మాటల కంపు సభలో ఎక్కువైంది.. ముందు సీఎం నోరు ప్రక్షాళన చేయాల్సి ఉందని ఎద్దేవా చేశారు..

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -