నవతెలంగాణ-హైదరాబాద్: పహల్గాం ఉగ్రదాడులతో పాకిస్థాన్, భారత్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. పాక్ పై దౌత్యపరంగా భారత్ ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంది. దీంతో పాక్ ప్రభుత్వం అల్లాడిపోతుంది. ఇండియా ఆర్మీ ఏ నిమిషంలో తమ దేశంపై దాడి చేస్తుందోమోనని షరిప్ ప్రభుత్వం ఆగమాగమవుతుంది. భారత్ చేసే ఎటువంటి సైనిక దాడినైనా ఎదురుకోవడానికి ముందునుంచే సన్నదమవుతుంది. అందుకు ఆ దేశ వాయుసేనను సంసిద్ధం చేస్తోంది. పైటర్ జెట్లను ఆదేశ సరిహద్దు ప్రాంతాలకు తరలిస్తుంది. యుద్ద ట్యాంకర్లను బార్డర్ ప్రాంతాలకు మోహరిస్తున్నాయి. అదేవిధంగా జలాంతర్గామిల్లో మందుగుండు సామ్రాగిని లోడ్ చేసివుంచారు. ఏ క్షణ ఇండియన్ ఆర్మీ ఎటాక్ చేసినా..ఎదురుదాడికి చేయడానికి కాచుకొని కుసుంది పాక్ నావీ దళం. మరోవైపు పాకిస్తాన్ వైమానిక దళం విమాన కార్యకలాపాలను 50 శాతానికి పైగా తగ్గించింది. గగనతలంలో గందరగోళాన్ని నివారించడానికి అవసరమైన కార్యకలాపాలను మాత్రమే నిర్వహిస్తున్నట్లు ఆ దేశ మీడియా సంస్థలు కథనాలు వెలువరించాయి. కాగా కొన్ని రోజుల నుంచి పాక్ రాజకీయ నేతలు మాటలతో కవ్వింపు చర్యలకు పాల్పడుతన్నారు. సింధు జలాల నిలిపివేస్తే..నెత్తురు పారుతోందని ఆదేశ నేత నోరుపారేసుకున్నారు. ఇవాళ భారత్‌పై 36గంటల్లో పాక్ ఆర్మీ దాడి చేస్తుందని సమాచార మంత్రి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
పాక్ సరిహద్దులో యుద్ధ సన్నాహాలు..!
- Advertisement -
RELATED ARTICLES