- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధంలో అమెరికాకు చెందిన పదుల సంఖ్యలో యుద్ధ విమానాలు ధ్వంసమైనట్లు సమాచారం. దీనికి సంబంధించి తాజాగా దెబ్బతిన్న KC-135R ట్యాంకర్ విమానం యూకేలోని RAF మిల్డెన్‌హాల్ మీదుగా ప్రయాణించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విమానంపై మరమ్మతుల గుర్తులు కనిపించాయని నివేదికలు చెబుతున్నాయి. గతంలో సౌదీ స్థావరంపై జరిగిన దాడుల్లో కూడా ఇలాంటి పలు విమానాలు దెబ్బతిన్నట్లు సమాచారం. మొత్తం 39 అమెరికా విమానాలు ధ్వంసమైనట్లు కొన్ని మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ఇందులో కొన్ని ఫైటర్ జెట్లు కూడా ఉన్నట్టు తెలుస్తోంది.
- Advertisement -


