- కాంగ్రెస్ నాయకులు జూపల్లి రమేష్ బాబు
నవతెలంగాణ-అశ్వారావుపేట: సీపీఐ (ఎం) అభ్యర్థి తగరం నిర్మల గెలుపుతోనే వార్డు అభివృద్ది సాధ్యమని 13 వార్డు కౌన్సిలర్ అభ్యర్థి జూపల్లి రమేష్ బాబు అన్నారు. కాంగ్రెస్ బలపరిచిన 21వ వార్డు సీపీఐ(ఎం) అభ్యర్థి తగరం నిర్మల విజయాన్ని కాంక్షిస్తూ బుధవారం వార్డు పరిధిలోని పేరొయిగూడెం,ఫచమర్ కాలనీల్లో ఆయన విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఎమ్మెల్యే జారె ఆదినారాయణ పర్యవేక్షణలో వార్డు వారీ అభివృద్ధి ప్రణాళికలు రూపొందించారని తెలిపారు.వార్డులో అర్హులైన పేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేయిస్తామనీ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా నాయకులు చిరంజీవి,మండల నాయకులు సోడెం ప్రసాద్,ముల్లగిరి గంగరాజు,కలపాల భద్రం, చీమకుర్తి వెంకటేశ్వరరావు, కొల్లి వెంకట రమణ, తగరం ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు



