నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని రెండవ విడత గ్రామపంచాయతీల వార్డు సభ్యులకు శిక్షణ తరగతులను జుక్కల్ ఎంపిడివో ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో ప్రారంభించడం జరిగిందని ఎంపీడీవో శ్రీనివాస్, ఎంపీ ఓ రాము తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ మండలంలోని 30 గ్రామపంచాయతీ లకు సంబంధించి వార్డ సభ్యుల శిక్షణ తరగతులను మూడు పాలుగా విభజించామని అన్నారు.

మొదటి విడతలో 11 గ్రామాలకు పంచాయతీలకు సంబంధించిన వార్డు సభ్యులకు శిక్షణ పూర్తి చేయడం జరిగింది రెండవ విడతలో భాగంగా 10 గ్రామపంచాయతీలకు సంబంధించిన వార్డు సభ్యులకు శికణ తరగతులు పూర్తి అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో, ఎంపీవో, అవగాహన పరచే శిక్షకులు నాగయ్య, అశోక్ గౌడ్, దివాకర్, నవీన్, రెండో విడత గ్రామపంచాయతీ వార్డు సభ్యుల జీపీ సెక్రటరీలు, ఆయా గ్రామాల సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.



