- Advertisement -
నవతెలంగాణ-హైదారాబాద్: అంగోలా దేశాధ్యక్షుడు భారతదేశానికి చేరుకున్నారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌కు ఆదేశ ప్రెసిడెంట్ జోవో మాన్యువల్ గొన్కాల్వ్స్ లౌరెన్కోను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోడీలు ఘన స్వాగతం పలికారు. సైనిక వందనంతో ఆదేశ ప్రెసిడెంట్ జోవో మాన్యువల్ గొన్కాల్వ్స్ లౌరెన్కో ఎర్రతివాచీ వేసి ఆహ్వానించారు. ఈనెల 4వరకు ఆయన భారత్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఇరుదేశాల అధినేతల మధ్య అత్యున్నత స్థాయి సమావేశాలు జరగనున్నాయి. ఈ భేటీలో వ్యవసాయం, ఫార్మా , సాంకేతికత తదితర విషయాలపై చర్చించి ఒప్పందాలు చేసుకోనున్నారు.
- Advertisement -