Sunday, November 9, 2025
E-PAPER
Homeజిల్లాలుCulvert : కల్వర్టుపై నీళ్లు.. నీళ్ల కింద పెద్ద గుంతలు

Culvert : కల్వర్టుపై నీళ్లు.. నీళ్ల కింద పెద్ద గుంతలు

- Advertisement -

పొంచి ఉన్న ప్రమాదం

మరమ్మతులు చేయడంలో అధికారులు ప్రభుత్వం విఫల

నవతెలంగాణ-మద్దూరు

మద్దూరు మండల కేంద్రం నుండి ముస్త్యాల వెళ్లే మధ్యలో ఉన్న చిన్న వాగు కల్వర్టుపై పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి ప్రమాదకరంగా ఉన్నాయి.వర్షాకాలం కావడంతో ఆ గుంతలలో నీరు నిలవడంతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. కల్వర్టుపై గుంతలు ఏర్పడ్డ కల్వర్టుకు మరమ్మతులు చేయడంలో ప్రభుత్వం అధికారులు పూర్తిగా విఫలమయ్యారని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రాణాలు పోతేనే మరమ్మత్తులు చేస్తారా అని నిలదీస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు స్పందించి వెంటనే చిన్న వాగు కల్వర్టుపై ఏర్పడ్డ గుంతలను పూడ్చి మరమ్మతులు చేయాలని వాహనదారులు కోరుతున్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -