- Advertisement -
నీటిని పొదుపుగా వాడుకోవాలి..సర్పంచ్ జంగిడి శ్రీనివాస్
నవతెలంగాణ – మల్హర్ రావు:
మండలంలోని ఎడ్లపల్లి, రుద్రారం, కొండంపేట, కొయ్యుర్ గ్రామాల్లోని రైతులు రబీలో వరి పంటలు సాగు చేయడానికి ఎడ్లపల్లి గ్రామ శివారులోగల అటవీప్రాంతంలో ఉన్న చిన్నతరహా బొగ్గులవాగు ప్రాజెక్ట్ నీటిని బుధవారం గ్రామ సర్పంచ్ జంగిడి శ్రీనివాస్ తుము ద్వారా నీరు విడుదల చేశారు.ప్రాజెక్టు ఆయకట్టు సుమారుగా ఐదు వేల ఎకరాలు ఉంటుంది కానీ యాసంగిలో టైబంది ఖరారు చేసిన పొలాలు మాత్రమే సాగు కానున్నాయి.రైతులు నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ వేల్పుల రమేష్,వార్డు సభ్యులు మెరుగు శ్రీనివాస్,ఇరిగేషన్ సిబ్బంది పాల్గొన్నారు
- Advertisement -



