- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్ వాసులకు అధికారులు కీలక అలర్ట్ జారీ చేశారు. నగరంలో రెండు రోజుల పాటు నీటి సరఫరా నిలిచిపోనుంది. జనవరి 10, 11 (శని, ఆదివారాల్లో) హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో 36 గంటల పాటు నీటి సరఫరా నిలిచిపోనుంది. కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లై స్కీమ్ (ఫేజ్–2) పరిధిలో ముఖ్యమైన మరమ్మతు పనులు చేపట్టనుండటంతో నీటి సరఫరాకు ఆటంకం ఏర్పడనుంది. జనవరి 10, శనివారం ఉదయం 6 గంటల నుంచి ఆదివారం సాయంత్రం 6 గంటల వరకు, అంటే మొత్తంగా 36 గంటల పాటు నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. ఈ మరమ్మతు పనుల వల్ల నగరంలోని అనేక ప్రాంతాల్లో మంచినీటి సరఫరా ఆగిపోతుందని హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డు అధికారులు తెలిపారు.
- Advertisement -



