Wednesday, November 5, 2025
E-PAPER
Homeజిల్లాలుమిరప తోటల్లో నీరు నిల్వను తొలగించాలి

మిరప తోటల్లో నీరు నిల్వను తొలగించాలి

- Advertisement -

జిల్లా ఉద్యాన శాఖ అధికారి ఏ.సునీల్ కుమార్.

నవతెలంగాణ-మల్హర్ రావు

మిరప తోటల్లో నీరు నిల్వ ఉండకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని భూపాలపల్లి ఉద్యానవన శాఖ అధికారి ఏ.సునీల్ కుమార్ తెలిపారు. బుధవారం మండల కేంద్రమైన తాడిచర్ల శివారులో అధిక వర్షాల కారణంగా నీట మునిగిన మిరప తోటలను ఆయన పరిశీలించారు.నీట మునిగిన మిరప పంటను రక్షించడానికి తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు.తోటల్లో నిల్వ నీటిని గుంటలు,కాలువలు త్రవ్వి డ్రైనేజీ ఏర్పాటు చేసి,తోట చుట్టూ నీటి ప్రవాహం సులభంగా ఉండేలా కాల్వలు, నాళాలు శుభ్రం చేయాలని సూచించారు.అధిక తేమ కారణంగా వేరుల కుళ్ళు వ్యాధి వచ్చే అవకాశముందని దీని నివారణ కొరకు నీరు తగ్గిన వెంటనే ట్రైకోడెర్మా విరైడే లేదా ప్సూడోమోనాస్ ఫ్లోరసెన్స్ కలిగిన జైవ నాశనకారిని వేర్ల చుట్టూ పిచికారీ చేయాలని సూచించారు.కిలో ట్రైకోడెర్మా మరియు వంద కిలోల పూడి ఆవు పేడ లేదా ఎరువులో కలిపి తోటలో చల్లడం ద్వారా వేరుల వ్యాధులను నియంత్రించవచ్చన్నారు.జీవ సంబంధిత పద్ధతులతో పాటు అవసరమైతే రసాయనిక ఫంగిసైడ్‌లను కూడా వాడవచ్చని సూచించారు.రసాయనిక నియంత్రణ చర్యలలో భాగంగా,వేరుల కుళ్ళు నివారణకు

కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రా/లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి లేదా మెటాలాక్సిల్ మరియు మాంకోజెబ్ 2.5 గ్రా/లీటర్ నీటిలో కలిపి స్ప్రే చేయాలన్నారు.నీరు తగ్గిన తర్వాత, మొక్కలు తిరిగి పుంజుకునేందుకు హ్యూమిక్ యాసిడ్ లేదా అమినో యాసిడ్ 3 మి.లీ/లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలన్నారు.అలాగే మైక్రోన్యూట్రియెంట్స్ కలిపి పిచికారీ చేయడం ద్వారా మొక్కలు పునరుద్ధరించుకుని ఆకులు తిరిగి పచ్చగా మారుతాయని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -