Tuesday, September 9, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంఆర్థిక రాజ‌ధాని ముంబై జ‌ల‌దిగ్భందం

ఆర్థిక రాజ‌ధాని ముంబై జ‌ల‌దిగ్భందం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: ప‌లు రోజులుగా ఏడ‌తెరిపిలేకుండా కురుస్తున్న వ‌ర్షాల‌కు ఆర్థిక రాజ‌ధాని ముంబై జ‌ల‌దిగ్భంద‌మైంది. సోమవారం ఉదయం కూడా భారీ వర్షం కురిసింది. ముంబైలోని ప‌లు ప్రాంతాలు హింద్మాతా, అంధేరి, పరేల్ వంటి లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. రాబోయే కొన్ని గంటలు వర్షం ఇలాగే కొనసాగితే రైల్వే ట్రాక్‌లు మునిగిపోయే అవకాశం ఉంది. ఇప్పటికే కుర్లా స్టేషన్‌లోని సెంట్రల్ రైల్వే ట్రాఫిక్‌కు అంతరాయం కలిగే అవకాశం ఉంది. ప్రస్తుతం సెంట్రల్, హార్బర్ రైల్వే లైన్‌లలో స్థానిక రైళ్లు 15 నుంచి 20 నిమిషాలు ఆలస్యంగా నడుస్తున్నాయి.

ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ముంబైలోని పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఉదయం సెషన్‌లో పిల్లలను పాఠశాలల నుంచి సురక్షితంగా ఇంటికి పంపించడానికి ఏర్పాట్లు చేయాలని ముంబై సంరక్షక మంత్రి ఆశిష్ షెలార్ మున్సిపల్ కార్పొరేషన్ పరిపాలనను ఆదేశించారు.రాబోయే కొన్ని గంటలు వర్షం కొనసాగే అవకాశం ఉన్నందున పోలీసులు, పౌరులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. ఏదైనా నీటి ఎద్దడి సంఘటన జరిగితే అత్యవసర నంబర్‌కు సంప్రదించాలని కూడా విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad