నవతెలంగాణ-హైదరాబాద్: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)కు వ్యతిరేకమని ఎంపీ ప్రియాంకాగాంధీ స్పష్టంచేశారు.స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతో ఎన్నికల సంఘం బీజేపీకి ఓట్లు చోరీచేసి పెడుతోందని కోజికోడ్ మీడియా సమావేశంలో ప్రియాంక విమర్శించారు. ఎస్‌ఐఆర్‌కు వ్యతిరేకంగా తాము ఇప్పటికే పార్లమెంటు లోపల, బయట పోరాటం చేశామని చెప్పారు. ఇకముందు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌కు వ్యతిరేకంగా తమ పోరాటం కొనసాగుతుందని తెలిపారు.
బీహార్ (Bihar) లో మాదిరిగానే దేశమంతటా ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేపట్టేందుకు కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission of India) సిద్ధమైంది. 2026లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న రాష్ట్రాల్లో ముందుగా రివిజన్ చేపట్టి మిగతా రాష్ట్రాల్లో ఓటర్ల జాబితాలను ఆ తర్వాత సవరించాలని ఎన్నికల సంఘం భావిస్తోంది.



