Tuesday, September 2, 2025
E-PAPER
spot_img
Homeఅంతర్జాతీయంమేం కూడా ఉగ్ర‌వాదుల బాధితుల‌మే: ప్రధాని షరీఫ్

మేం కూడా ఉగ్ర‌వాదుల బాధితుల‌మే: ప్రధాని షరీఫ్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: చైనా వేదికగా షాంఘై సహకార సదస్సులో పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ వింతైన ప్రసంగం చేశారు. ఉగ్రదాడులకు తమ దేశం బాధిత దేశమని వ్యాఖ్యానించారు. తమ దేశం 90,000 మందికి పైగా ప్రాణాలను కోల్పోయిందని.. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చేసిన పోరాటంలో 152 బిలియన్లకు పైగా ఆర్థిక నష్టాలను చూసిందని తెలిపారు.

బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో జరిగిన ఉగ్రవాద దాడుల వెనుక విదేశీ శక్తులు ఉన్నాయని ఆరోపించారు. ఈ సందర్భంగా జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలు బందీ సంఘటనను గుర్తుచేశారు. పాకిస్థాన్ అన్ని రకాల ఉగ్రవాదాన్ని ఖండిస్తుందన్నారు. కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం ఉగ్రవాదాన్ని అస్త్రంగా వాడుకుంటున్నారని విమర్శించారు. ద్వైపాక్షిక ఒప్పందాలను తాము గౌరవిస్తామని పేర్కొన్నారు. అలాగే ఎస్‌సీవో సభ్యులు కూడా ఇలాంటి సూత్రాలను అనుసరించాలని ఆశిస్తున్నట్లు షరీఫ్ అన్నారు. మోడీ ప్రసంగం తర్వాత షరీఫ్ ప్రసంగం అర్థరహితంగా మారింది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad