నవతెలంగాణ-హైదరాబాద్ : హైదరాబాద్‌ను కాలుష్య రహిత నగరంగా మార్చుతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. రెడ్, ఆరెంజ్ కేటగిరి పరిశ్రమలను ఓఆర్‌ఆర్ బయటకు పంపిస్తామని అన్నారు. ప్రజాభవన్‌లో నిర్వహించిన మహిళా దినోత్సవ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు.
‘‘మహిళా జర్నలిస్టులతో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం సంతోషంగా ఉంది. మహిళలకు సరైన గుర్తింపు ఇవ్వాలని ఈ ప్రభుత్వం భావిస్తోంది. పోలీస్ సహా అవకాశం ఉన్న ప్రతి విభాగంలో మహిళ అధికారులకు బాధ్యతలు అప్పగిస్తున్నాం. మహిళల ఆర్థిక శక్తి పెరిగినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది’’
‘‘హైదరాబాద్‌లోని డీజిల్ బస్సులను 2026 డిసెంబర్‌లోపు జిల్లాలకు తరలిస్తాం. హైదరాబాద్‌లో వంద శాతం ఈవీ బస్సులను తెస్తున్నాం. డిసెంబర్ 9లోపు నగరంలో డీజిల్ బస్సులు ఉండవు. హైదరాబాద్‌లో ఏసీ ఈవీ బస్సులు తెస్తాం. కళాశాలలకు వెళ్లే విద్యార్థినులకు ఈవీ స్కూటీలు ఇవ్వాలనుకుంటున్నాం’’ అని సీఎం అన్నారు.



