– రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ
– దేశంలో సన్నబియ్యం పంపిణీని మించిన పథకంలేదు: మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్
– 14న తిరుమలగిరిలో కొత్త కార్డుల పంపిణీని ప్రారంభించనున్న సీఎం
నవతెలంగాణ- తిరుమలగిరి
ప్రజా ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం సామాజిక న్యాయానికి కట్టుబడి పనిచేస్తుందని నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ఉమ్మడి నల్లగొండ జిల్లా ఇన్‌చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. ఈనెల 14న సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో సీఎం చేతుల మీదుగా రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభ సభ జరగనుంది. ఆ బహిరంగ సభ ఏర్పాట్లపై శుక్రవారం జిల్లా కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్, ఎంపీ కిరణ్ కుమార్‌రెడ్డి, రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ సభ్యులు సుధీర్‌రెడ్డితో కలిసి తిరుమల గిరిలో సన్నాహక సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లా డుతూ.. బీసీలకు స్థానిక సంస్థ ఎన్నికల్లో 42 శాతం రిజర్వే షన్ అమలు కోసం చట్టం తెచ్చామని తెలిపారు. ప్రజల కోరిక మేరకు ఎస్సీ వర్గీకరణ చేశామని, బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ అనే రెండు క్యాబి నెట్ సబ్ కమిటీలకు చైర్మెన్‌గా తానే వ్యహరిం చానని తెలిపారు. ఈనెల 14న ఐదు లక్షల కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతున్నామన్నారు. రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని తెలిపారు. దేశంలో సన్న బియ్యం పంపిణీని మించిన సంక్షేమ పథకం ఎక్కడా లేదన్నారు. తుంగతుర్తి నియోజక వర్గం బీఎన్‌ఆర్ లాంటి గొప్ప వీరులు జన్మించిన గడ్డ అని, ఈ నియోజకవర్గం అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని తెలిపారు.
ఇన్‌చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ.. గత పాలకులు పేదల సంక్షేమం కోసం ఏ పథకం చేయలేదని, కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదని అన్నారు. ప్రజా ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పేదల సంక్షేమం కోసం కృషి చేస్తోందని, ఈ నెల 14న మధ్యాహ్నం 3 గంటలకు సీఎం చేతుల మీదుగా జరిగే నూతన రేషన్ కార్డుల పంపిణీి సభను అందరూ సమన్వ యం చేసుకుంటూ విజయవంతం చేయాలని సూచించారు. ఎమ్మెల్యే మందుల సామెల్ మాట్లా డుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అవకాశం ఇచ్చినందుకు ప్రభు త్వానికి కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో ఎమ్మె ల్సీ శంకర్‌నాయక్, రాష్ట్ర వ్యవసాయ కమి షన్ మెంబర్ చెవిటి వెంకన్నయాదవ్, జిల్లా ఎస్పీ కె.నర సింహ, అదనపు కలెక్టర్ పి.రాంబాబు, డీఆర్డీఓ అప్పారావు, డీఎఫ్‌ఓ సతీష్ కుమార్, డీఎస్‌ఓ మెహన్‌బాబు, ఆర్డీఓ వేణు మాధవరావు, తహసీల్దార్ హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.