Friday, December 26, 2025
E-PAPER
Homeజాతీయం‘SIR’తో ఓటు హ‌క్కు కోల్పోతున్నాం: విజయ్

‘SIR’తో ఓటు హ‌క్కు కోల్పోతున్నాం: విజయ్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ఎస్ఐఆర్ అంశంపై ‘ఎక్స్’ వేదికగా టీవికే అధినేత, ప్రముఖ నటుడు విజయ్ కీల‌క వీడియోను విడుదల చేశారు. ఎస్ఐఆర్ నేపథ్యంలో చాలామంది తమ ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషన్ ప్రచురించే ఓటరు జాబితాలో మన పేర్లు కనిపిస్తేనే ఓటు వేయగలమని గుర్తుంచుకోవాలని సూచించారు.తమిళనాడులో 6.36 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని, కానీ ఎస్ఐఆర్(SIR) ప్రక్రియను నెలలోపు ఎలా పూర్తి చేయగలుగుతారని ఆయన ప్రశ్నించారు.

ఓటు అనేది అత్యంత శక్తిమంతమైన ప్రజాస్వామ్య సాధనమని గుర్తుంచుకోవాలని ఆయన ఉద్బోధించారు. మన ఓటు మన ప్రజాస్వామ్య ఆయుధమని పేర్కొన్నారు. “జెన్ జెడ్ ఒక శక్తి. వారు అప్రమత్తంగా ఉండాలి. అంతా మంచి జరుగుతుంది. విజయం ఖాయం” అని విజయ్ తన వీడియోను ముగించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -