Friday, August 29, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంమేం హిందీకి వ్య‌తిరేకం కాదు: శరద్‌ పవార్‌

మేం హిందీకి వ్య‌తిరేకం కాదు: శరద్‌ పవార్‌

- Advertisement -


న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: మహారాష్ట్ర ప్రజలు హిందీ భాషకు వ్యతిరేకం కాదని, కానీ 1 నుంచి 4 తరగతుల ప్రాథమిక పాఠశాల విద్యార్థులు తప్పనిసరిగా హిందీ నేర్చుకోవాలని నిబంధన విధించడం మాత్రం తగదని ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌ పవార్‌ అన్నారు. 5వ తరగతి నుంచి హిందీ నేర్చుకోవడం విద్యార్థులకే మంచిదన్నారు. భాషా వివాదాలపై శుక్రవారం పవార్‌ స్పందిస్తూ.. దేశంలో 55 శాతం మంది మాట్లాడే హిందీని అలక్ష్యం చేయలేము. మరాఠా, ఇంగ్లిష్‌ మీడియం స్కూళ్లలో 1 నుంచి 5వ తరగతి వరకు హిందీని మూడోభాషగా బోధించాలని గత వారం మహారాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులతో వివాదం మొదలైంది అని అన్నారు. మహారాష్ట్ర విద్యార్థులపై హిందీని రుద్దే ప్రయత్నాన్ని తాము తీవ్రంగా ప్రతిఘటిస్తామని, జూలై 5, 7 తేదీల్లో విడివిడిగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని శివసేన (ఉద్ధవ్‌), మహారాష్ట్ర నవ నిర్మాణసేన పార్టీలు గురువారం ప్రకటించాయి. మరాఠీ మూలాలు రూపుమాపడానికి రాష్ట్ర ప్రభుత్వం భాషాపరమైన ఎమర్జెన్సీని విధిస్తోందని విమర్శలు చేశాయి.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad