Monday, July 7, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంమేం మౌనంగా లేం..

మేం మౌనంగా లేం..

- Advertisement -

– చట్టపరంగా ముందుకెళుతున్నాం…
– బనకచర్లపై మంత్రి ఉత్తమ్‌
– హరీశ్‌రావు వ్యాఖ్యలు నిరాధారమంటూ ఖండన
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

ఏపీ ప్రభుత్వం నిర్మించతలపెట్టిన గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీశ్‌రావు చేసిన ఆరోపణలను మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి తోసిపుచ్చారు. ”గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుపై నిర్ణయాత్మకంగా వ్యవహరిస్తున్నాం. జనవరి 22న కేంద్ర జలశక్తి, ఆర్థికశాఖ మంత్రులకు లేఖ రాశాను. ఆ ప్రాజెక్టుపై అభ్యంతరాలు తెలిపాను. బనకచర్ల ప్రాజెక్టుపై కాంగ్రెస్‌ పార్టీ మౌనం వహించలేదు. చట్టపరంగా ముందుకెళ్తున్నాం. హరీశ్‌రావు వాదనలు నిరాధారం, తప్పుదారి పట్టించేలా ఉన్నాయి. నదీ జలాల హక్కులపై తెలంగాణకు నష్టం చేసింది బీఆర్‌ఎస్సే. కష్ణానది వాటాను కేవలం 299 టీఎంసీలకే పరిమితం చేశారు. బీఆర్‌ఎస్‌ హయాంలోనే ముచ్చుమర్రి, మాల్యాల నుంచి నీటిని తరలించారు. రాయలసీమ ఎత్తిపోతలపై అపెక్స్‌ కౌన్సిల్‌ను మీరెందుకు సంప్రదించలేదు. ఏపీ..రోజూ 3 టీఎంసీలు మళ్లిస్తోంటే కేసీఆర్‌ చోద్యం చూశారు. జగన్‌, కేసీఆర్‌ మధ్య అవగాహనతోనే తెలంగాణ నీటిని ఏపీకి దోచిపెట్టారు” అని ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి ఆరోపించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -