Monday, May 12, 2025
Homeఅంతర్జాతీయంఇస్తాంబుల్ వేదిక‌గా శాంతి చర్చలకు తాము సిద్ధం: రష్యా అధ్యక్షుడు

ఇస్తాంబుల్ వేదిక‌గా శాంతి చర్చలకు తాము సిద్ధం: రష్యా అధ్యక్షుడు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ర‌ష్యా-ఉక్రెయిన్ మ‌ధ్య మూడేళ్లకు పైగా కొనసాగుతున్న యుద్ధానికి తెర‌ప‌డ‌నుంది. జెలెన్‌స్కీతో చ‌ర్చ‌లు జ‌ర‌పడానికి తాము సిద్ధంగా ఉన్న‌ట్లు రష్యా అధ్య‌క్షుడు పుతిన్ ప్ర‌క‌టించారు. ఈనెల 15న‌ ఇస్తాంబుల్‌ వేదికగా ఇరుదేశాల చర్చలకు ఆయన ప్రతిపాదించారు. ఎటువంటి ముందస్తు షరతులు లేకుండా కీవ్‌ ప్రత్యక్ష చర్చలను తిరిగి ప్రారంభించాలని తాము కోరుతున్నట్లు పుతిన్‌ ఆదివారం ఓ ప్రకట‌న‌లో పేర్కొన్నారు. ఈ విషయంపై తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగాన్‌తో మాట్లాడతానని అన్నారు. ఈ చర్చల ద్వారా పూర్తిస్థాయి కాల్పుల విరమణ అమల్లోకి వచ్చే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే తాము మానవతా దృక్పథంతో ఉక్రెయిన్‌కు చెందిన ఇంధన వనరులపై దాడులను ఆపేశామని, ఈస్టర్ కాల్పుల విరమణ, ‘విక్టరీ డే’ కాల్పుల విరమణ వంటివి ప్రకటించామని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -