నవతెలంగాణ-హైదరాబాద్: పాకిస్థాన్-ఆప్ఘనిస్థాన్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొని పరస్పరం దాడులకు చేసుకున్న విషయం తెలిసిందే. తాలిబన్ సేనలు పాక్ సరిహద్దులో బీకర దాడులు చేసింది. దీంతో పాక్ తోకమూడిచి తాలిబన్ ప్రభుత్వంతో కాల్పుల విరమణ ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా రెండు దేశాల మధ్య 48 గంటల పాటు సీజ్ ఫైర్ అమలో ఉంది. అయితే ఆఫ్ఘన్ సేనలకు భారత్ సాయమందిస్తుందని పాక్ ఆరోపించిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి ఆదేశ రక్షణ మంత్రి రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మరోసారి నోరు పారేసుకున్నారు. తాలిబన్లతో సరిహద్దు ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో రెండు వైపులా యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన ప్రకటించారు.
ఓ టెలివిజన్ ఛానెల్‌తో ఖవాజా ఆసిఫ్ మాట్లాడారు. ఈ సందర్భంగా భారత సరిహద్దులో ఉద్రిక్తతలు తీవ్రమయ్యే అవకాశం ఉందా? అని విలేకరు ప్రశ్నించగా అందుకు ఆయన బదులిస్తూ.. ఎలాంటి పరిస్థితులను అయినా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామంటూ ఈ సందర్భంగా ప్రకటించారు. పాక్ విషయంలో ఆఫ్ఘాన్, భారత్ అనుచితంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపించారు. రెండు వైపులా యుద్ధానికి సిద్ధంగా ఉన్నామన్నారు.