నవతెలంగాణ నిజామాబాద్ సిటీ : విద్యుత్ ప్రమాదాల నివారణకు అన్ని చర్యలు తీసుకుంటూ, విద్యుత్ వినియోగదారులకు, ముఖ్యంగా రైతులకు విద్యుత్ పట్ల అవగాహన కల్పిస్తూ విస్తృత ప్రచారం కల్పిస్తున్నామని నిజామాబాద్ సర్కిల్ సూపెరింటెండింగ్ ఇంజనీర్ ఆర్. రవీందర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందుకు విస్తృతంగా అవగాహనా కార్యక్రమాలు చేపడుతూ, చైతన్యం కల్పిస్తున్నామని వివరించారు. జీరో విద్యుత్ ప్రమాదాల లక్షంగా సర్కిల్ లోని డి.ఈ. టెక్నికల్ అధికారులను సేప్టీ అధికారులు గా నియమించి విద్యుత్ ప్రమాదాల నివారణకు కృషి చేస్తున్నామని అన్నారు.
రైతుల సమస్యలను విని వారి సమస్యలను పరిష్కరించడానికి “విద్యుత్ అధికారుల పోలం బాట” కార్యక్రమాన్నికూడా చేపడుతున్నామని ఈ కార్యక్రమంలో ఇప్పటి వరకు లూజ్ లైన్లు 592 పునరుద్దరించామని, వంగిన పోల్ లు 582 సరి చేశామని, మధ్య స్థంబాలు 939 నెలకొల్పామని, ఎంతో మంచి సత్ఫలితాలు ఇస్తుందని చెప్పారు. లో లెవెల్ లైన్ క్రాసింగ్ 789 ., డబల్ ఫీడింగ్ పాయింట్లను 1017 మార్చమని చెప్పారు. తక్కువ ఎత్తులో ఉన్న డిటిఆర్ ప్లింట్ లను 674. ఎత్తు పెంచమని చెప్పారు. జన సామర్థ్యం ప్రదేశాలలో భద్రత సూచనల బోర్డ్ లు ఏర్పాటు చేస్తున్నమని తెలిపారు. ప్రమాదాలు జరిగే ప్రదేశాలను గుర్తించి వాటిని యుద్ధ ప్రాతిపదికన సరి చేస్తున్నమని చెప్పారు. నిరంతర శిక్షణ, భద్రతా పద్ధతులను బలోపేతం చేయడం వలన భద్రతా ప్రమాణాలను పెంచగలుగుతున్నామని తెలిపారు. విద్యుత్ ప్రమాదాల నివారణను ఒక సంకల్పంగా తీసుకొని అన్ని చర్యలు తీసుకుంటూ జీరో ప్రమాదాల లక్షంగా అహర్నిశలు కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు. ఎటువంటి విద్యుత్ సమస్య తలెత్తిన టోల్ ఫ్రీనంబర్ 1912 కు సంప్రదించాలని కోరారు.
విద్యుత్ ప్రమాదాల నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES