– కామారెడ్డి పట్టణ సిఐ నరహరి నాయక్
నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి పట్టణంలో నేరాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని కామారెడ్డి పట్టణ సిఐ నరహరి నాయక్ అన్నారు. పోలీసు అమరవీరుల దినోత్సవం పురస్కరించుకొని ఆయన కలిసిన సందర్భంలో ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు జరగకుండా పోలీస్ కళా బృందంతో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని, ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి వాహనం నడపాలని, మద్యం సేవించి వాహనం నడపకూడదని, మద్యం సేవించి వాహనం నడపడం వల్ల మీ కుటుంబంతో పాటు మీ వల్ల ప్రమాదానికి గురి అయిన కుటుంబం సైతం రోడ్డు మీద పడుతోందన్నారు.
ఇప్పటివరకు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో 36 మందికి జైలు శిక్షలు పడగా 1600 మందికి ఫైన్ పడ్డాయని ఆయన పేర్కొన్నారు. సైబర్ క్రైమ్ జరిగిన సందర్భాల్లో సైతం ఒకరికి 30 లక్షల వరకు, ఒకరికి 15 లక్షల వరకు రికవరీ చేయించడం జరిగిందన్నారు. ముఖ్యంగా పట్టణ ప్రజలు సైబర్ క్రైమ్ జరగగానే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 1930 కి ఫోన్ చేసి వివరాలు తెలపాలన్నారు, లేదా మీకు దగ్గరలోని సంబంధిత పోలీస్ స్టేషను సంప్రదించాలని సూచించారు.
నేరాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES