Friday, August 29, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుమహా న్యూస్‌పై దాడిని ఖండిస్తున్నాం : మంత్రి సీతక్క

మహా న్యూస్‌పై దాడిని ఖండిస్తున్నాం : మంత్రి సీతక్క

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
మహాన్యూస్‌ మీడియా సంస్థపై కొందరు దాడిచేయడాన్ని రాష్ట్ర మంత్రి డాక్టర్‌ ధనసరి అనసూయ(సీతక్క) ఖండించారు. ఇలాంటి చర్యలు పత్రికా స్వేచ్ఛను హరించే కుట్రలో భాగమేనని పేర్కొన్నారు. శనివారం ఈ మేరకు ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. వార్తల పట్ల అభ్యంతరాలుంటే ప్రజాస్వామికంగా నిరసన వ్యక్తపరచాలి తప్ప.. దాడులు, బెదిరింపుల వంటి హింసాత్మక చర్యలకు దిగడం సరిగాదని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ మీడియా సంస్థలు తమపై ఇష్టారాజ్యంగా వార్తలు ప్రసారం చేసినా, తమ వ్యక్తిగత ప్రతిష్టకు భంగం వాటిల్లేలా తప్పుడు రాతలు రాసినా తాము సంయమనం పాటించామని, ఎక్కడా దాడులను ప్రొత్సహించలేదని గుర్తు చేశారు. నచ్చని మీడియా సంస్థలపై దాడులు చేసే సంస్కృతిని బీఆర్‌ఎస్‌ మానుకోవాలని హితవు పలికారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా కవ్వింపు చర్యలకు దిగితే ప్రజా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad