Wednesday, January 14, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జర్నలిస్టుల అక్రమ అరెస్టులను ఖండిస్తూన్నాం

జర్నలిస్టుల అక్రమ అరెస్టులను ఖండిస్తూన్నాం

- Advertisement -

– మాజీ ఎంపీటీసీ ఉరుపక్క సరిత నగేష్ 
నవతెలంగాణ-మర్రిగూడ : రాష్ట్రంలో వరుసగా జర్నలిస్టుల అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నామని మండలంలోని ఇందుర్తి గ్రామానికి చెందిన నామపురం మాజీ ఎంపీటీసీ ఊరు పక్క సరిత నగేష్ అన్నారు.బుధవారం స్థానికంగా వారు మాట్లాడారు.అరెస్టులకు సంబంధించి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ప్రొసీజర్ పాటించకుండా  అర్ధరాత్రి పండుగ పూట జర్నలిస్టుల ఇళ్లలోకి వెళ్ళి అరెస్టులు చేయడం అవసరమా అని ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు.జర్నలిస్టులు  క్రిమినల్స్ కాదు టెర్రరిస్టులు కాదు వారిపట్ల ఎందుకు అంత కఠినంగా వ్యవహరిస్తున్నారని,జర్నలిస్టుల పట్ల ప్రభుత్వం ది హేయమైన చర్య అని అన్నారు.అరెస్ట్ అయిన జర్నలిస్టులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -