Tuesday, February 10, 2026
E-PAPER
Homeజాతీయంతాము ఎవ‌రిపై దాడి చేయ‌డానికి వెళ్ల‌లేదు..బ్యానర్ పట్టుకోవడం తప్పా: ఎంపీ వర్ష గైక్వాడ్

తాము ఎవ‌రిపై దాడి చేయ‌డానికి వెళ్ల‌లేదు..బ్యానర్ పట్టుకోవడం తప్పా: ఎంపీ వర్ష గైక్వాడ్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: లోక్ స‌భ‌లో ఫిబ్ర‌వ‌రి 5న 8మంది మ‌హిళ ఎంపీలు చేప‌ట్టిన నిర‌స‌న‌లపై పార్ల‌మెంట్ వ్య‌వ‌హారాల మంత్రి కిర‌ణ‌ రిజిజు సోష‌ల్ మీడియా వేదిక‌గా ఆనాటి వీడియోను విడుద‌ల చేశారు. ఈ నేప‌థ్యంలో కాంగ్రెస్ ఎంపీ వర్ష గైక్వాడ్ స్పందించారు. కేంద్ర మంత్రి వాదనలను “నిరాధారమైన ఆరోపణలు” అని ఖండించారు. మహిళా ఎంపీలు అధికార పార్టీ ఎంపీల వద్దకు ఎవరిపైనా దాడి చేయడానికి వెళ్లలేదని ఆమె పేర్కొన్నారు.

కాంగ్రెస్ ఎంపీ, “కిరెన్ రిజిజు ఆ రోజు సభలో లేరా? వీడియోలో కొత్తగా ఏముంది? అతను ఇప్పటికే వీడియో చూడలేదా? మాపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. మేము ఎవరిపైనా దాడి చేయడానికి వెళ్లలేదు; మేము కేవలం బ్యానర్ పట్టుకున్నాము. అతను (ప్రధాని మోడీ) బ్యానర్ కారణంగా భయపడ్డాడు. అతను పుస్తకం తీసుకోవడానికి భయపడ్డాడు. అతను సుంకాలు లేదా చైనా గురించి మాట్లాడటానికి ఇష్టపడడు. బ్యానర్ పట్టుకోవడం తప్పా?ష‌ అని ఇమె ప్రశ్నించారు.

8మంది మ‌హిళా ఎంపీల‌పై బీజేపీ ప్ర‌భుత్వం అస‌త్య ప్ర‌చారానికి పునుకుంద‌ని విప‌క్షాలు మండిప‌డుతున్నాయి. భార‌తీయ రైతుల‌ను మోసం చేసి, వారి ఉపాధిని దెబ్బ‌తీయ‌డానికి పీఎం మోడీ ట్రంప్‌తో రాజీపడ్డార‌ని విమ‌ర్శించాయి. పార్ల‌మెంట్ ఉభ‌య‌స‌భ‌ల్లో యూఎస్ ట్రేడ్ డీల్‌పై, 2020లో చైనా-భార‌త్ మ‌ధ్య తలెత్తిన స‌రిహ‌ద్దు వివాదాల‌పై ఆర్మీ మాజీ చీప్ జ‌న‌ర‌ల్ న‌ర‌వాణే రాసిన స్టార్ ఫోర్స్ ఆప్ డిస్టినీ బుక్ చ‌ర్చ జ‌ర‌గాల‌ని ప్ర‌తిప‌క్షానికి చెందిన 8మంది మ‌హిళా ఎంపీలు..పీఎం మోడీ స్థానం ఎదుట శాంతియుతంగా నిర‌స‌న తెలిపారు. ఈ వ్య‌వ‌హారంపై బీజేపీ స‌ర్కార్ వీడియో విడుద‌ల చేసి దుష్ప్ర‌చారం చేస్తోంద‌ని విప‌క్షాలు మండిప‌డ్డారు. స‌దురు అంశాల‌పై చ‌ర్చ పెట్ట‌కుండా, విప‌క్షాల‌కు స‌భ‌లో స‌రైన టైం ఇవ్వ‌కుండా స్పీక‌ర్ ఓం బీర్లా ఏక‌పక్షం వ్య‌వ‌హ‌రించార‌ని, రాష్ట్రప‌తి ప్ర‌సంగంపై మాట్లాడానికి ప్ర‌తిపక్ష‌నేత‌కు మైక్ ఇవ్వాలేద‌ని గుర్తు చేశారు. యూఎస్ ట్రేడ్ డీల్‌పై చ‌ర్చ పెట్టాల‌ని స‌భ‌లో డిమాండ్ చేసినందుకు 8మంది ఎంపీల‌ను సస్పెండ్ చేశార‌ని, పార్ల‌మెంట్ లో ప్ర‌తిప‌క్షాల గొంతును నొక్కుతున్నార‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

https://twitter.com/KirenRijiju/status/2021082523649073377?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2021082523649073377%7Ctwgr%5E4ba105f9e23f3a05694770d609fa1bbbd5b5a80a%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.ntnews.com%2Fnational%2Fopposition-women-mps-blocked-pm-modis-path-in-loksabha-government-released-video-2297878
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -