- Advertisement -
– డా. రేఖా బోయలపల్లి తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు
నవతెలంగాణ-హైదరాబాద్ : మీలా పొలిటికల్ స్టంట్‌కి కాదు… మేము ప్రజల అవసరాలకే పని చేస్తున్నాం అని తెలంగాణ మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు రేఖ బోయలపల్లి కేటీఆర్ ను ఉద్దేశించి అన్నారు.
- పెన్షన్
10 ఏళ్లుగా పెంచని పెన్షన్‌ను మేమే పునఃప్రారంభించాం.
ఖాళీ ఖజానా నుంచే గౌరవంగా మొదలుపెట్టాం. - మహాలక్ష్మి పథకం
RTC బస్సుల్లో ఉచితంగా తిరుగుతున్న లక్షల మహిళలే అసలైన మహాలక్ష్ములు. - రుణమాఫీ
BRS హయాంలో 70% రుణాలు మాఫీ కాలేదు.
కాంగ్రెస్ రైతుకి భరోసా, బ్యాంకుకు గౌరవం కల్పిస్తోంది.
4.రైతు భరోసా
ఇప్పటికే 70,11,600 మంది రైతులకు రైతు భరోసా అమలు.
మా పని బడ్జెట్‌తో – మీ పని ఫోటోలతో. - రైతుబీమా
పేపర్ పాలసీ కాదు.
ప్రతి రైతు కుటుంబానికి తక్షణ భరోసా ఇవ్వడమే మా లక్ష్యం. - బంగారం కాదు, భవిష్యత్
ఆడబిడ్డలకు బంగారం కన్నా రిజర్వేషన్ల రూపంలో భద్రత, గౌరవం కల్పిస్తోంది కాంగ్రెస్. - స్కూటర్ పథకం
BRS హయాంలో హామీలే మిగిలాయి.
మేము బడ్జెట్‌తో, మెరిట్‌తో, పారదర్శకంగా అమలు చేస్తున్నాం. - ఇళ్ల నిర్మాణం
మీ ఇళ్లు పక్షుల గూళ్లయ్యాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం పక్కా ప్లాన్‌తో నిర్మిస్తోంది. - GHMC బుల్డోజర్
ఇది చెత్త పాలన శుభ్రం చేసే యంత్రం.
బుల్డోజర్ న్యాయంపై నడుస్తోంది. - పల్లెల్లో భయం?
మా పాలన భయాన్ని కాదు, భవిష్యత్తును పంచుతుంది.
ఇది వన్ మ్యాన్ షో కాదు – ప్రజల రాజ్యం. - గ్యారంటీలు
మా గ్యారంటీలు గెజిట్‌లో ఉన్నాయి.
మీ విమర్శలు గాలిలో ఉన్నాయి.
మా గ్యారంటీలపై ప్రజలకు నమ్మకం ఉంది.
దాన్ని మేము నిలబెట్టుకుంటాం.
ఇది కాంగ్రెస్ మాట కాదు… కార్యచరణ.
ఇది ప్రజల పాలన, పటిష్ఠంగా అమలు అవుతున్న వాస్తవం.
- Advertisement -