- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ఫామ్‌హౌస్ పార్టీకి తమకు సంబంధం లేదని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీను, మాధురి తెలిపారు. ‘మా ఫ్యామిలీ ఫ్రెండ్ ఒకరు పిలిస్తే అక్కడికి వెళ్లాం. బిజినెస్ మీట్ పెడుతున్నాం రమ్మని అడిగారు. అక్కడ విదేశీ మద్యం, హుక్కా ఉందని మాకు తెలియదు’ అని శ్రీను మీడియాకు చెప్పారు. ‘నాకు హుక్కా అంటే ఏంటో కూడా తెలియదు. పోలీసులు చెప్పాకే ఆ పార్టీకి పర్మిషన్ లేదని తెలిసింది. నేను అరెస్ట్ కాలేదు. ఇంట్లోనే ఉన్నా’ అని మాధురి వివరించారు.
- Advertisement -



