- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: టీ20 వరల్డ్‌కప్ 2026 సూపర్-8 మ్యాచ్‌లో భారత్‌పై ఘన విజయం సాధించిన అనంతరం దక్షిణాఫ్రికా కెప్టెన్ ఐడెన్ మార్‌క్రమ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీ20 వరల్డ్‌కప్ 2024 ఫైనల్లో ఎదురైన ఓటమికి ఇది ప్రతీకారం లాంటిదని పేర్కొన్నాడు. భారత్ వంటి బలమైన జట్టును వారి సొంత గడ్డపై ఇంత భారీ తేడాతో ఓడించడం చాలా ఆనందంగా ఉందని చెప్పాడు. ఈ విజయం జట్టు విశ్వాసాన్ని పెంచిందని, ఇదే ఉత్సాహాన్ని కొనసాగిస్తూ తదుపరి మ్యాచ్‌ల్లో కూడా విజయాలు సాధించి సెమీఫైనల్‌కు చేరాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించాడు.
- Advertisement -



