Thursday, August 21, 2025
E-PAPER
spot_img
Homeహైదరాబాద్జీవో 118 బాధితులను ఆదుకోవాలి

జీవో 118 బాధితులను ఆదుకోవాలి

- Advertisement -

నవతెలంగాణ-నాగోల్‌
ఎల్బీనగర్‌ నియోజకవర్గంలోని జీవో 118 బాధిత కాలనీల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్క రించాలని టీపీపీసీ ప్రచార కమిటీ చైర్మెన్‌, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్‌ కోరారు. ఈ మేరకు సీఎం రేవంత్‌ రెడ్డిని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో శనివారం మధుయాష్కీ గౌడ్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మధుయాష్కీ గౌడ్‌ మాట్లాడుతూ బీఎన్‌ రెడ్డినగర్‌ డివిజన్‌, నాగోల్‌ డివిజన్‌ తదితర ప్రాం తాలలో 2007 నుంచి రిజిస్ట్రేషన్ల సమస్య ఉన్న విష యాన్ని వివరించారు. ఎంపీగా మల్కాజిగిరి నియోజక వర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన రేవంత్‌ రెడ్డికి రిజి స్ట్రేషన్ల సమస్య తెలుసునని గుర్తు చేశారు. గత బీఆర్‌ ఎస్‌ ప్రభుత్వం మునుగోడు ఉప ఎన్నికల్లో లబ్ధి కోసం హడావుడిగా స్వార్థపూరితంగా జీఓ118ను తీసుకువచ్చి రిజిస్ట్రేషన్ల సమస్య పరిష్కరించకపోగా.. కొత్త సమస్యలు తెచ్చిపెట్టారని వివరించారు. అప్పటి సీఎం ఫోటోతో పాటు కన్వీనియన్స్‌ డీడ్‌లను అందజేశారని.. వాటి వల్ల ఇళ్లకు బ్యాంక్‌ లోన్లు రాకపోగా, ఆ భవనాలకు విలువ లేకుండా పోయిందని వివరించారు. ఆ భవనాలను విక్రయించే పరిస్థితి కూడా లేదని పేర్కొన్నారు. గత ప్రభుత్వం మోసపూరితంగా వ్యవహరించిన తీరుతో ప్రజలంతా ఇబ్బందులు పడాల్సి వస్తుందని పేర్కొన్నారు. సమస్యను ఉన్నతాధికారులకు వివరించి.. పరిష్కరించేలా తగిన ఆదేశాలు జారీ చేయాలని ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డిని కోరారు. అనంతరం జీవో 118 సమస్యను వివరిస్తూ పరిష్కరించాలని కోరుతూ లేఖను అందజేశారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad