– కాంగ్రెస్ కార్పొరేటర్లను గెలిపించి నియోజక వర్గ అభివృద్ధికి కృషి చేయండి
– కోటగల్లి కార్నర్ మీటింగ్ లో టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్
నవతెలంగాణ-కంఠేశ్వర్ : జనం పిలిస్తే పలికే నాయకులు కావాలని, కాంగ్రెస్ కార్పోరేటర్ లను గెలిపించి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయండి అని కోటగల్లి కార్నర్ మీటింగ్లో టిపిసిసి అధ్యక్షులు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ప్రజలను కోరారు.ఓటు వేసి గెలిపిస్తే మోసం చేసిన నాయకులకు తగిన గుణపాఠం చెప్పండి అని తెలియజేశారు. నిత్యం ప్రజా క్షేత్రంలో ఉండే నాయకులను గెలిపించండి.ఉచిత బస్సు మొదలుకొని సన్న బియ్యం వరకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు.మోదీ సొంత రాష్ట్రం లో సైతం సన్న బియ్యం పంపిణీ లేదు అని తెలియజేశారు. 2 వేల కోట్ల నిధులు ఇచ్చి మేటి నగరంగా మారుస్తూ అని సీఎం బహిరంగ సభలో హామీ ఇచ్చారు. అద్దాలు పెట్టుకొని చేతులు ఊపడం కాదు రాజకీయం అంటే అంటూ పార్టీలను విమర్శించారు.పనిచేసే నాయకులను గెలిపించండి. బీజేపీ నేతలు దేవుడు పేరు చెప్పి రాజకీయాలు చేస్తున్నారని, బీజేపీ నేతల మాటలు చూస్తుంటే చిన్న పిల్లలు నవ్వుకునే పరిస్థితి నెలకొంది అని తెలియజేశారు. పిసిసి అధ్యక్షుడి అయ్యాక మూడు నెలల్లో 35 ఏళ్ల ఇంజనీరింగ్ కళాశాల స్వప్నం నెరవేర్చా నని , సీఎం చేతుల మీదుగా వ్యవసాయ కళాశాల కు శంకుస్థాపన చేయించామన్నారు. కాంగ్రెస్ అభివృద్ధిని చూడాలన్నారు. 26వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శివప్రసాద్ను గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నగేష్ రెడ్డి, ఉర్ద అకాడమీ చైర్మన్ తాహార్బిన్ హందన్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాంభూపాల్, డాక్టర్ కవితా రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ,
జనం పిలిస్తే పలికే నాయకులు కావాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



