Wednesday, August 6, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలి..

స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలి..

- Advertisement -

-కేసీఆర్ చేసిన అభివృద్ధి ప్రజలకు వివరించాలి 
– కాంగ్రెస్ వైఫల్యాలను  చర్చి పెట్టి ఎండగట్టాలి 
– హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడిత‌ల సతీష్ కుమార్
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ 

రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు కార్యకర్తలు సిద్ధం కావాలని మాజీ ఎమ్మెల్యే సతీశ్ కుమార్ పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో హుస్నాబాద్ లోని భారత రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయంలో బుధవారం  భీమదేవరపల్లి  మండల స్థాయి బీఆర్ఎస్ పార్టీ గ్రామాలవారిగా  కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ విజయం సాధించేలా కృషి చేయాలన్నారు.

గత కేసీఆర్ ప్రభుత్వం హాయంలో చేసిన అభివృద్ధి, ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ హయాంలో ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ విఫలమైందని, గ్రామాల్లో చర్చ పెట్టి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని సూచించారు. వార్డు మెంబర్ నుండి ఎంపీపీ,, జెడ్పీటీసీ వరకు బీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కార్యకర్త కష్టపడి పని చేయాలని, పార్టీ గెలుపు కోసం కష్టపడి పని చేసిన కార్యకర్తలకు గుర్తింపు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ  నాయకులు కార్యకర్తలు  పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -