Friday, November 21, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వ్యర్ధాల ద్వారా ఆదాయం చేకూర్చేలా చూడాలి..

వ్యర్ధాల ద్వారా ఆదాయం చేకూర్చేలా చూడాలి..

- Advertisement -

జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్..
నవ తెలంగాణ సూర్యాపేట కలెక్టరేట్..

వ్యర్ధాల ద్వారా ఆదాయం చేకూర్చేలా మున్సిపల్ అధికారులు ప్రణాళికలు రూపొదించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం లోని కలెక్టర్ ఛాంబర్ లో శుక్రవారం జిల్లా లోని మున్సిపల్ కమిషనర్లు, ఇంజనీరింగ్ అధికారులు, శానిటరీ ఇన్స్ పెక్టర్లతో వ్యర్ధాల నిర్వహణపై ఆయన వీడియో కాన్ఫి రెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ మున్సిపాల్టీలలో సేకరించిన వ్యర్ధాలను డంపింగ్ యార్డ్ లలో గానీ, వ్యర్థాలను వేరు చేసే కేంద్రాలలో గాని ఘన వ్యర్ధ పదార్థాలలోని తడి, పొడి, ప్లాస్టిక్, రీ సైక్లింగ్ చేసే వాటిని వేరు చేసి మట్టిలో సహజంగా విచ్చిన్న మయ్యే పదార్థాల ద్వారా ఎరువులు తయారు చేసి ఆదాయం చేకూర్చుకోవాలని అలాగే అన్ని మున్సిపాలిటీలలో వ్యర్థాలను వేరు చేసే కేంద్రాలు కార్యకలపాలు నిర్వహించేలా చూడాలని సూచించారు.పర్యావరణానికి హాని కల్గించే విష పదార్థాలు ,పారిశ్రామిక వ్యర్ధాలు లాంటి కాలుష్య నీరు చెరువులలో, కాలువలలో కలవకుండా సరైనా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫిరెన్స్ కు అదనపు కలెక్టర్ కే సీతారామారావు,మున్సిపల్ కమిషనర్లు హన్మంత రెడ్డి, రమాదేవి, శ్రీనివాస రెడ్డి, మున్వర్ అలీ,ఇంజనీరింగ్ అధికారులు, శానిటరీ ఇన్స్ పెక్టర్లు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -