నవతెలంగాణ-ముధోల్ : రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. మండలంలోని ఆష్ట,బ్రహ్మంన్ గావ్, విట్టొలి, బొరిగాం, వడ్తల్, చింతకుంట,ఎడ్ బిడ్,కారేగాం, వెంకటాపుర్,చించాల గ్రామంలో పిఎసిఎస్, ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి సకాలంలో ఏర్పాటుకు కృషి చేయడం జరిగిందన్నారు. మక్కల కొనుగోలు కేంద్రాలను కూడా ప్రారంభిస్తామని చెప్పారు. రైతుల కోసం నిరంతరం పని చేస్తానన్నారు. రైతులు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించి, మద్దతు ధర పొందాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బంది తలెత్తిన తనకు గాని, సంబంధిత అధికారులకు తెలియజేయాలని సూచించారు. రైతులకు నష్టం జరుగుతే సహించేది లేదన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని అన్నారు. ముధోల్, రువ్వి, గన్నొర, గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను త్వరలో ఏర్పాటు చేస్తామని చెప్పారు. రైతులు ఆందోళన చెంద వద్దన్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ శ్రీలత, ఎంపిడిఓ లవకుమార్, ఎఓ రచన, భైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ చైర్మన్ ఆనంద్ రావ్ పటేల్,పిఎసిఎస్ చైర్మన్ తీగల వెంకటేష్ గౌడ్, వైస్ చైర్మన్ సాయిరాం, బిజేపి మండల అధ్యక్షుడు కోరిపోతన్న, డైరెక్టర్ లు ధర్మపురి సుదర్శన్, ప్రవీణ్ రేడ్డి,నాయకులు సతీష్ రెడ్డి,సప్పట్టోల పోతన్న, శ్రీనివాస్, రమెష్, విఠల్ రావు, లక్ష్మి నారాయణ,నిమ్మ పోతన్న, కిష్టయ్య,దత్తాద్రి, గంగాధర్, సాయినాథ్ , రాంచందర్ రెడ్డి, భూమెష్,తదితరులు పాల్గొన్నారు.
కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి : ఎమ్మెల్యే పవార్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



