Monday, May 5, 2025
Homeరాష్ట్రీయంరామస్వామి మార్గంలో ముందుకు సాగాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ

రామస్వామి మార్గంలో ముందుకు సాగాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ

- Advertisement -

– ప్రముఖ రచయిత్రి శ్రీ ఊహకు అవార్డు ప్రదానం
– పాల్గొన్న ఎమ్మెల్సీ, ప్రజాకవి గోరటి వెంకన్న, ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్‌ రెడ్డి
నవతెలంగాణ – మహబూబ్‌నగర్‌ ప్రాంతీయ ప్రతినిధి

జీవితాంతం కమ్యూనిస్టుగా పేదప్రజల పక్షాన ఉన్న కందికొండ రామస్వామి కమ్యూనిస్టు రామస్వామిగా పేరొందారని, ఆయన ఆశయ సాధనకు మనమందరం కృషి చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ అన్నారు. ఆదివారం నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంలోని సింగిల్‌ విండో సమావేశం హాల్‌లో నెలపొడుపు సాహిత్య సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన కందికొండ రామస్వామి స్మారక పురస్కారం ప్రదాన కార్యక్రమంలో ఎమ్మెల్సీ, ప్రజాకవి గోరటివెంకన్న, ఎమ్మెల్యే డా.కూచుకుళ్ల రాజేష్‌ రెడ్డితో కలిసి జాన్‌వెస్లీ పాల్గొన్నారు. ఈ అవార్డుకు ఎంపికైన బల్కావ్‌ బ్యాక్‌ ప్యాక్‌ కథల పుస్తక రచయిత్రి ఃఃశ్రీ ఊహఃఃకు అవార్డును ప్రదానం చేశారు. ఆమెను శాలువాతో సత్కరించి పదివేల నగదు బహుమతి అందజేశారు. ఈ సందర్భంగా సంస్థ కార్యదర్శి పి.వహీద్‌ ఖాన్‌ అధ్యక్షతన జరిగిన సభలో జాన్‌వెస్లీ మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో కందికొండ రామస్వామి కొరియర్‌గా పనిచేసి కమ్యూనిస్టు పార్టీకి బాసటగా నిలిచారని గుర్తుచేశారు. అనంతరం సీపీఐ(ఎం)లో ఉంటూ పార్టీ అభివృద్ధికి కృషి చేశారన్నారు. ఆయన స్ఫూర్తిని, చైతన్యాన్ని తీసుకొని ముందుకు సాగాలని కోరారు. ఈ అవార్డు నెలకొల్పిన రామస్వామి కుటుంబ సభ్యులకు అభినందనలు తెలిపారు. ఎమ్మెల్సీ గోరటివెంకన్న మాట్లాడుతూ.. కందికొండ రామస్వామి ఆదర్శమైన జీవితం అందరికీ స్ఫూర్తిదాయ కమన్నారు. కులమతాలతో సంబంధం లేకుండా తనను ఆదరించారని, ఆయనను మరువలేమని అన్నారు. నేడున్న పరిస్థితుల్లో కమ్యూనిజమే అజేయమని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే రాజేష్‌ రెడ్డి మాట్లాడుతూ.. రామస్వామి స్ఫూర్తిగా తీసుకొని నేటి రాజకీయాల్లో ముందుకు సాగుతూ నాగర్‌ కర్నూల్‌ అభివృద్ధికి కషిచేస్తున్నానని తెలిపారు. అనంతరం అవార్డుకు ఎంపికైన బల్కావ్‌ బ్యాక్‌ కథల పుస్తకాన్ని కవి ఎదిరెపల్లి కాశన్న సమీక్ష చేశారు. ఈ కార్యక్రమంలో కందికొండ మోహన్‌, మార్కెట్‌ చైర్మెన్‌ రమణారావు, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్ధం పర్వతాలు, నాయకులు ఆర్‌.శ్రీనివాస్‌, కందికొండ గీత తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -