- జిల్లా కలెక్టర్ హనుమంతరావు
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ - సమాజంలో ని మూఢాచారాలను పారద్రోలి కులమత రహిత సమాజాన్ని నిర్మించడానికి కృషిచేసిన గొప్ప సంఘ సంస్కర్త శ్రీ బసవేశ్వర అని జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. మహాత్మా శ్రీ బసవేశ్వర 892 వ జయంతి సందర్భంగా బుధవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో శ్రీ బసవేశ్వర చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సమాజంపై అవగాహన కల్పించిన మొదటి గురువు బసవేశ్వరుడు అని, బసవేశ్వరుడు జగత్ గురువుగా వారు చూపిన మార్గంలో నడుస్తూ వారి ఆశయ సాధనకు కృషి చేయాలని అన్నారు. ఒకరినొకరు పరస్పరం గౌరవించుకుంటూ వారు ఇచ్చిన శాంతి సందేశం పాటించినట్లయితే ఉద్రిక్త వాతావరణం ఉండదని అన్నారు. బసవేశ్వరుడి జీవిత చరిత్ర ఈ తరానికి తెలవాల్సిన అవసరం ఉందన్నారు. వారి ఆశయ సాధనకు కృషి చేస్తూ సమాజ చైతన్యానికి పాటుపడాలన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ అధికారి యాదయ్య, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్యామ్ సుందర్, వివిధ కుల సంఘ నాయకులు శాఖ సిబ్బంది లు పాల్గొన్నారు.
- Advertisement -