Friday, May 30, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మండల సమైక్య లాభాల బాటలో నడవాలి

మండల సమైక్య లాభాల బాటలో నడవాలి

- Advertisement -

నవతెలంగాణ – రాయపర్తి
స్వర్ణ భారతి మండల సమైక్య లాభాల బాటలో నడవాలని మండల సమైక్య అధ్యక్షురాలు తాళ్లపల్లి అమరావతి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని మండల సమైక్య భవనంలో 15వ వార్షికోత్సవ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2024 – 2025 గాను ప్రగతి నివేదిక, ఆర్థిక నివేదికలను వివరించారు. ఈ వార్షిక సంవత్సరానికి 3 లక్షల 20 వేల రూపాయలు మండల సమైక్యకు లాభం వచ్చిందన్నారు. స్నేహ సంఘాలు, ఇన్సూరెన్స్ పథకాలు, బ్యాంకు లింకేజ్, ఇన్స్ ట్యూషన్ బిల్డింగ్, వ్యవసాయతర కార్యక్రమాలపై చర్చించి అందరికీ అర్థం అయ్యే రీతిలో వివరించారు. మహిళల ఆర్థిక సహకారతతోనే గ్రామాలలోని కుటుంబాలు ఆర్థిక ప్రగతి సాధిస్తాయని తెలిపారు. మండలంలోని డ్వాక్రా సంఘాలు చాలా చక్కగా కొనసాగ పడుతున్నాయని వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో ఏపిఎం రాపాక కిరణ్ కుమార్, సీసీలు దేవేంద్ర, అనిత, పావని, వినోద, యాదగిరి, మండల సమాఖ్య పాలకవర్గం అభేద, మమత, అకౌంటెంట్ శైలజ, ఆపరేటర్ శారద, ఎఫ్ పిసి చైర్మన్ మమత, విఓఏలు, విఓ అధ్యక్షురాలు, కార్యదర్శులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -