Monday, November 24, 2025
E-PAPER
Homeజిల్లాలుఅక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాం: సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మహిపాల్

అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాం: సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మహిపాల్

- Advertisement -

నవతెలంగాణ – వికారాబాద్ రూరల్: కొడంగల్ లో ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా సీపీఐ(ఎం) నేతలను ముందుస్తు అరెస్టులు చెయ్యడం సరికాదు. ఈ అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నామని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఆర్ మహిపాల్ అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో నిరంకుశ పాలన కొనసాగిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ఖబర్దర్ అని హెచ్చరించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని మహిపాల్ డిమాండ్ చేశారు. ఆయన మాట్లాడుతూ అందరికీ ఇండ్లు, ఇండ్ల స్థలాలు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలని అన్నారు. కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాలు అమలు చెయ్యాలని అన్నారు. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలి. విద్యా, వైద్యం అందరికీ ఉచితంగా అందించాలని తెలిపారు. రోడ్లు బాగు చెయ్యాలి. అన్ని గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించడం, ఆర్టీసీ బస్ స్టాండ్ లలో తాగునీరు అందించాలని అన్నారు. ఉద్యోగ కార్మికులకు రావలసిన పెండింగ్ పిఆర్సిపిఎఫ్ డబ్బులు వెంటనే ఇవ్వాలన్నారు. డబుల్ బెడ్ రూమ్ లను పూర్తి చేసి పేదలకు అందించాలని డిమాండ్ చేశారు. అంతే కానీ, నిత్యం ప్రజల మధ్య ఉండి ప్రజాసమస్యలను ప్రభుత్వాల దృష్టికి తెచ్చే సీపీఐ(ఎం) నేతలను అరెస్టులు చెయ్యడం సరికాదని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -