Sunday, February 15, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంభారత్‌తో సమతుల్య సంబంధాలు కోరుకుంటున్నాం: తారిఖ్ రెహమాన్

భారత్‌తో సమతుల్య సంబంధాలు కోరుకుంటున్నాం: తారిఖ్ రెహమాన్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: బంగ్లాదేశ్ కాబోయే ప్రధాని తారిఖ్ రెహమాన్ భారత్‌తో తమ దేశ సంబంధాలపై స్పష్టతనిచ్చారు. సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత శనివారం ఢాకాలో మీడియాతో మాట్లాడుతూ, భారత్‌తో సమతుల్య సంబంధాలు కోరుకుంటున్నామని, తమ దేశ ప్రయోజనాలే విదేశాంగ విధానాన్ని నిర్ణయిస్తాయని తెలిపారు. భారత్, చైనా, పాకిస్తాన్ వంటి దేశాలను బంగ్లాదేశ్‌కు యజమానులుగా చూడబోమని, ఏ ఒక్క దేశానికీ సంబంధాలను పరిమితం చేయబోమని పేర్కొన్నారు. మరోవైపు, భారత ప్రధాని నరేంద్ర మోడీ రెహమాన్‌కు ఫోన్ చేసి అభినందనలు తెలిపి, మెరుగైన సంబంధాల కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -