నవతెలంగాణ-హైదారాబాద్: అలాస్కా వేదికగా పుతిన్-ట్రంప్ చర్చలు అభినందనీయమని భారత్ కొనియాడింది. రష్యా-ఉక్రెయిన్ దేశాలు తొందరగా యుద్దానికి ముగింపు పలకాలని ప్రపంచ దేశాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. ఈ తరుణంలో ఇరుదేశాల భేటీని స్వాగతిస్తున్నామని ఓ ప్రకటనలో పేర్కొంది. చర్చల ద్వారానే ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుందని, అందుకు అమెరికా-రష్యా అధినేతలు ప్రయత్నాలు అభినందనీయమని, వారి చర్చలను భారత్ ప్రభుత్వం స్వాగతిస్తుందని పేర్కొంది. ‘శాంతి సాధన దిశగా వారి ప్రయత్నాలు ఎంతో ప్రశంసనీయం. ఈ భేటీలో సాధించిన పురోగతిని అభినందిస్తున్నాం. చర్చలు, దౌత్యం ద్వారా మాత్రమే సమస్య పరిష్కారానికి ముందుకెళ్లాలి. ఉక్రెయిన్ సంక్షోభానికి వీలైనంత త్వరగా తెరపడాలని ప్రపంచం కోరుకుంటోంది’’ అని శనివారం విదేశాంగశాఖ తన ప్రకటనలో పేర్కొంది.
అలాస్కా చర్చలను స్వాగతిస్తున్నాం: భారత్
- Advertisement -
- Advertisement -