అధ్యక్షుడు ఎవరైనా అందరం కలిసి పనిచేస్తాం
వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి
నవతెలంగాణ – వనపర్తి
కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుని ఎంపికలో వనపర్తి జిల్లాకు అబ్జర్వర్లు నియమింపబడ్డ వ్యక్తుల నిర్ణయానికి కట్టుబడి అధ్యక్షుడు ఎవరిని ఎన్నుకున్న తాము కలిసికట్టుగా పని చేయనున్నట్లు వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం వనపర్తి పట్టణంలోని దాక్ష లక్ష్మయ్య ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన సంఘతాన్ శ్రీజన్ అభియాన్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాండిచ్చేరి మాజీ ముఖ్యమంత్రివర్యులు ఏఐసీసీ అబ్జర్వర్ నారాయణస్వామి, మాజీ ఎమ్మెల్సీ అలీ ఖాన్, బొజ్జ సంధ్యారెడ్డి, కోటేశ్వరరావు, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి తో పాటు స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఎంతో చక్కటి పరిపాలన చేస్తుందని పేర్కొన్నారు.
భారత్ జూడో యాత్రలో రాహుల్ గాంధీ చేపట్టిన పాదయాత్ర ఫలితంగానే మేమెంత మాకెంత అనే నినాదంతో బిసి, ఎస్సి రిజర్వేషన్లను కాంగ్రెస్ పార్టీ సమర్థవంతంగా అమలుపరచుతుందని ఎమ్మెల్యే తెలిపారు. డిసిసి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడి ఎన్నిక ప్రజాస్వామ్యంగా ఉండాలని ఇందుకు సంబంధించి క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను పరిగణంలోకి తీసుకొని సమర్థవంతుడైనటువంటి డిసిసి అధ్యక్షుని ఎన్నుకునేందుకు నేడు మానిలు మాజీ ముఖ్యమంత్రివర్యులు నారాయణస్వామి గారిని కాంగ్రెస్ పార్టీ నియమించడం గర్వించదగ్గ విషయమని ఎమ్మెల్యే తెలిపారు.
సముద్రం లాంటి కాంగ్రెస్ పార్టీలో చిన్న చిన్న తగాదాలు ఉండడం సహజమేనని మనందరం వీటిని పరిగణలోకి తీసుకోకుండా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవ్వడమే విజన్ గా ముందుకెళ్లాలని అందుకోసం అందరం కలిసికట్టుగా పని చేయాల్సి వస్తుందని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. వనపర్తి నియోజకవర్గంలో రానున్న ఎన్నికల్లో నవంబర్ 30 కంటే ముందు కాంగ్రెస్ పార్టీలో ఉన్న కాంగ్రెస్ వాదులకు మాత్రమే బీఫాంలో లభిస్తాయని అందుకు స్థానిక ఎమ్మెల్యేగా తాను రాష్ట్ర ప్రణాళిక బోర్డు వైస్ చైర్మన్ గారి చిన్నారెడ్డి గారు కలిసికట్టుగా పనిచేసే ప్రతి ఒక్కరికి బీఫాంలో అందించి గెలిపించుకుంటామని ఆయన అన్నారు.
అక్షింతల పార్టీ అయిన బిజెపి ప్రజలను మోసం చేస్తుందని జీఎస్టీని తగ్గించామని చెప్పేవాళ్ళు గత ఎనిమిది సంవత్సరాలుగా దోచుకున్న డబ్బును ప్రజలందకు పెంచాలని ఆయన అన్నారు. కొందరు వ్యక్తులు వనపర్తి నియోజకవర్గంలో బాకీ కార్డులు పట్టుకుని తిరుగుతున్నారని వనపర్తి నియోజకవర్గ ప్రజలకు 450 కోట్ల రూపాయలు బాకీ పడ్డ నాయకులు నేడు బాకీ కార్డులు పట్టుకొని తిరగడం సిగ్గుచేటునే ఆయన అన్నారు. రానున్న ఎన్నికల్లో ఎన్నిక ఏదైనా కాంగ్రెస్ పార్టీలో ఘన విజయం సాధించేలాగా అందరం కలిసికట్టుగా పని చేయాలని ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు రాజేంద్రప్రసాద్ వనపర్తి వ్యవసాయ మార్కెట్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, పెబ్బేరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ అధ్యక్షురాలు ప్రమోదిని రెడ్డి, డిసిసిబి అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి, గ్రంధాలయాల చైర్మన్ గోవర్ధన్ సాగర్, పీసీసీ సభ్యులు శంకర్ ప్రసాద్, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు వాకిటి ఆదిత్య, మహిళా అధ్యక్షురాలు శైలతా రెడ్డి, కాంగ్రెస్ పార్టీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, అన్ని మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ఎంపీపీలు మాజీ జెడ్పిటిసిలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
