Friday, May 9, 2025
Homeఅంతర్జాతీయంప్రతి రక్తపు బొట్టుకు ప్రతీకారం తీర్చుకుంటా : పాకిస్థాన్ ప్రధాని షరీఫ్

ప్రతి రక్తపు బొట్టుకు ప్రతీకారం తీర్చుకుంటా : పాకిస్థాన్ ప్రధాని షరీఫ్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ప్రతి రక్తపు బొట్టుకు ప్రతీకారం తీర్చుకుంటా అంటూ సంచలన ప్రకటన చేసాడు పాకిస్థాన్ ప్రధాని షరీఫ్. ఉగ్ర స్థావరాలపై భారత్ ‘ఆపరేషన్ సింధూర్’ చేపట్టడంలో పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సంచలన ప్రకటన చేశారు.
అక్కడ జాతినుద్దేశించి ఆయన ప్రసంగిస్తూ ‘ప్రతి రక్తపు బొట్టుకు ప్రతీకారం తీర్చుకుంటామన్నారు. భారత్‌కు ఎలా బదులివ్వాలో పాకిస్థాన్ కి బాగా తెలుసన్నారు. చనిపోయిన సాయుధ దళాలకు దేశం మొత్తం సెల్యూట్ చేస్తోందని’ ఆయన పేర్కొన్నారు.
ఇక అటు భారత సైన్యం నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ పాకిస్థాన్‌కు గట్టి గుణపాఠం చెప్పిందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఉగ్రవాద శిబిరాలపై భారత సైనికులు అర్ధరాత్రి ప్రత్యేక దాడులు నిర్వహించి, అసాధారణ ధైర్యసాహసాలు ప్రదర్శించారని ఆయన ప్రశంసించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -