నవతెలంగాణ – హైదరాబాద్ : 2024 టీ20 వరల్డ్ కప్ లో పటిష్టమైన పాకిస్తాన్ ను అమెరికా మట్టికరిపించి యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసిన విషయం తెలిసిందే. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని దాయాదీలు ఈ సారి జాగ్రత్త పడుతున్నారు. ఈ క్రమంలో పాకిస్తాన్‌లో పుట్టి పెరిగి అమెరికా తరుఫున ఆడుతోన్న మొహమ్మద్ మొహ్సిన్ మ్యాచుకు ముందే పాక్ ను హెచ్చరించాడు. సోమవారం ప్రీ-మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మోసిన్ మాట్లాడుతూ.. 2024 టీ20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ ను ఓడించామని.. ఈ సారి కూడా ఆ జట్టును మట్టికరిపిస్తామని ధీమా వ్యక్తం చేశాడు. అమెరికా క్రికెట్ టీమ్ అప్పటి కంటే ఇప్పుడు ఇంకా పటిష్టంగా ఉందన్నాడు. 2024లో తాను అమెరికా జట్టులో లేనని.. కానీ ఈ సారి టీమ్ లో తానున్నానని అన్నాడు. గత రెండేళ్లలో యూఎస్ఏ క్రికెట్ జట్టు నైపుణ్యం గణనీయంగా మెరుగుపడిందని అభిప్రాయం వ్యక్తం చేశాడు. ప్రస్తుత జట్టుకు పాకిస్తాన్‌ను ఓడించే సామర్ధ్యం ఉందన్నాడు. ఈ రోజు జరగబోయే మ్యాచులో పూర్తి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతామని పేర్కొన్నాడు.
మళ్ళీ పాక్‌ను ఓడిస్తాం: అమెరికా బౌలర్ మొహ్సిన్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



