Saturday, May 3, 2025
Homeఅంతర్జాతీయంట్రంప్ టారిఫ్‌ చ‌ర్చ‌ల‌పై ఓ అంచనాకు వ‌స్తాం: చైనా

ట్రంప్ టారిఫ్‌ చ‌ర్చ‌ల‌పై ఓ అంచనాకు వ‌స్తాం: చైనా

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ట్రేడ్ వార్‌లో సుంకాల‌తో ప‌ర‌స్ప‌రం దాడి చేసుకున్న అమెరికా, చైనా దేశాలు..ఎట్ట‌కేల‌కు చ‌ర్చల‌కు మొగ్గుచూపిన విష‌యం తెలిసిందే. బీజింగ్‌తో టారిఫ్‌ల‌పై చ‌ర్చిండానికి సంసిద్ధంగా ఉన్నట్లు అమెరికా ప్ర‌భుత్వం పేర్కొంది. తాజాగా ఈ ప్ర‌తిపాద‌న‌పై చైనా విదేశాంగ శాఖ శుక్ర‌వారం స్పందించింది. వాషింగ్టన్‌ ఇటీవల తీసుకున్న వాణిజ్య విధాన నిర్ణయాలు, సుంకాల తగ్గింపు విషయంపై అగ్రరాజ్యంతో చర్చలు జరపాలా..? వద్దా.. అని యోచిస్తున్నట్లు వెల్లడించింది. ఏక‌ప‌క్షంగా త‌మ‌పై టారిఫ్‌లు విధించిన ట్రంప్..త‌మతో నిజాయితీ వ్య‌వ‌హ‌రించాలంది.‘‘టారిఫ్ సమస్యలపై బీజింగ్‌తో చర్చలు జరపాలనే ఆశను వ్యక్తంచేస్తూ అమెరికా సంబంధిత వర్గాల ద్వారా అనేకసార్లు సందేశాలను పంపింది. దీంతో చర్చల విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోవాలనే విషయాన్ని అధికారులతో సంప్రదించి ఓ అంచనాకు వస్తాము’’ అని చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img