నవతెలంగాణ-హైదరాబాద్: అన్ని వివాదాలపై త్వరలోనే ఇండియాతో చర్చలు కొనసాగిస్తామని బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వ అధినేత యూనిస్ ఖాన్ అన్నారు. ఇటీవల రెండు దేశాలు భూమార్గం ద్వారా జరిగే ఎగుమతులు, దిగుమతులపై ఆంక్షలు విధించుకున్నాయి. షేక్ హాసినా సర్కార్ పడిపోయిన తర్వాత యూనిస్ ఖాన్ ఆధ్వర్యంలో ఏర్పడిన మధ్యంతర ప్రభుత్వం.. భారత్ కు ప్రతికూలంగా వ్యవహరిస్తుంది. ఈక్రమంలో ఆదేశానికి భారత్ నుంచి భూమార్గాన జరిగే దిగుమతులపై అదనంగా 10శాతం పన్ను విధిస్తామని, కేవలం ఇండియా దిగుమతులు రేవుల ద్వారానే తమ దేశంలోకి రావాలని మెలికే పెట్టింది.దీంతో ఆగ్రహించిన భారత్..ఆదేశానికి ఇటీవల కౌంటర్ ఇచ్చింది. బంగ్లా వ్యాపారులు కూడా కోల్‌కతా లేదా ముంబై ఓడరేవుల నుంచే భారత్‌కు ఆ దేశ దిగుమతులు రావాలని, లేకుంటే అదే స్థాయిలో పన్ను చెల్లించాలని పేర్కొంది. ఈక్రమంలో భారత్ చర్యలపై ఆదేశ ప్రభుత్వాధినేత స్పందించి..ఇండియాతో చర్చల ద్వారా వాణిజ్య వివాదాలను పరిష్కరించుకుంటామని తెలిపారు.
ఇండియాతో అన్ని వివాదాలపై చర్చిస్తాం: యూనిస్ ఖాన్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES