Friday, October 10, 2025
E-PAPER
Homeతాజా వార్తలుకాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడుతాం : కల్వకుంట్ల కవిత

కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడుతాం : కల్వకుంట్ల కవిత

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడుతామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. ఎల్ బీ నగర్ నియోజకవర్గంలోని మన్సూరాబాద్ కు చెందిన ప్రముఖ బీసీ నాయకుడు రామ్ కోటి 350 మంది అనుచరులతో కలిసి శుక్రవారం తెలంగాణ జాగృతిలో చేరారు. బంజారాహిల్స్ లోని జాగృతి కార్యాలయంలో జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వారికి కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, జాగృతి అంటేనే పోరాటాల జెండా.. జాగృతి అంటేనే విప్లవాల జెండా అన్నారు. అన్నిరంగాల్లో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం పోరాడుతామని తేల్చిచెప్పారు.
జాగృతిలో చేరడమంటే బతుకమ్మ ఆడినట్లు ఉంటుంది.. అదే సమయంలో పిడికిలెత్తి పోరాటం చేయాల్సి కూడా ఉంటుందన్నారు. ఆడబిడ్డలకు నెలకు రూ.2,500 ఇస్తామని ఈ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో ప్రసవం కోసం ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లిన గర్భిణులకు కేసీఆర్ కిట్ తో పాటు ఆర్థిక సాయం అందించేవారని.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అది బంద్ అయ్యిందన్నారు. పేదింటి ఆడబిడ్డల పెండ్లికి ఇస్తామన్న తులం బంగారం ఇవ్వడం లేదని.. ఏడాదిక 2 లక్షల ఉద్యోగాలిస్తామని హామీ ఇచ్చి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదన్నారు. బీసీల 42 శాతం రిజర్వేషన్లు కల్పించడంతో పాటు వారికి ఇచ్చిన అన్ని హామీలు అమలు చేయాలని మనం కొట్లాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తెలంగాణ జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎల్. రూప్ సింగ్ నాయక్, ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి తదితరులు పాల్గొన్నారు.
బీసీ రిజర్వేషన్ల సాధనపై సమాలోచనలు
స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించడానికి అనుసరించాల్సిన వ్యూహాలపై శుక్రవారం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బీసీ నాయకులు, యూపీఎఫ్ నాయకులతో సమావేశమయ్యారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు, జీవో 9 పై హైకోర్టు స్టే, స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను నిలుపుదల చేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ గెజిట్ జారీ చేయడం సహా పలు అంశాలపై చర్చించారు. సమావేశంలో బీసీ నాయకులు లేవనెత్తిన వివిధ అంశాలపైనా సమావేశంలో చర్చించారు. అందరి అభిప్రాయాల మేరకు ఉద్యమ కార్యాచరణ రూపొందించాలని నిర్ణయానికి వచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -