నవతెలంగాణ-హైదరాబాద్: సైన్స్ అండ్ టెక్నాలజీలో స్వావలంబనను వేగవంతం చేయడంపై దృష్టి సారించనున్నట్లు చైనా గురువారం ప్రకటించింది. ”లోతైన మరియు సంక్లిష్టమైన” మార్పులు మరియు పెరుగుతున్న ‘అనిశ్చితి’ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఐదేళ్ల ఆర్థికాభివృద్ధి ప్రణాళికపై నిర్వహించిన నాల్గవ ప్లీనం గురువారంతో ముగిసింది. ఈ సందర్భంగా ఈ ప్రకటన విడుదల చేసింది. ప్రముఖ చైనీస్ జనరల్ జాంగ్ షెంగ్మిన్‌ను సెంట్రల్ మిలటరీ కమిషన్ చైర్‌గా నియమించినట్లు స్థానిక మీడియా జిన్హువా తెలిపింది. ప్రస్తుతం సిఎంసిగా విధులు నిర్వహిస్తున్న జాంగ్, గతవారం అవినీతి ఆరోపణలపై కమ్యూనిస్ట్ పార్టీ నుండి బహిష్కరించబడిన మాజీ రెండవ ర్యాంక్ వైస్ చైర్ హీ వీడాంగ్ స్థానంలో నియమితులయ్యారు. జాంగ్ ఇప్పటికే కమిషన్ సభ్యులు మరియు పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి చెందిన రాకెట్ పోర్స్‌లో జనరల్ హోదాను కలిగి ఉన్నారు.
సైన్స్ అండ్ టెక్నాలజీలో స్వావలంబన వేగవంతంపై దృష్టి సారిస్తాం : చైనా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES