Thursday, July 17, 2025
E-PAPER
Homeజిల్లాలుచెంచులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తాం: ఎమ్మెల్యే

చెంచులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తాం: ఎమ్మెల్యే

- Advertisement -

ప్రొసిడింగ్ లు పంపిణీలో ఎమ్మెల్యే వంశీకృష్ణ..
నవతెలంగాణ – అచ్చంపేట

నల్లమలలో నివసిస్తున్న చెంచులందరికి ఇందిరమ్మ ఇండ్లు ప్రభుత్వం మంజూరు చేస్తుందని ఎమ్మెల్యే వంశీకృష్ణ అన్నారు. బుధవారం పదర మండలంలో చెంచు లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల ప్రొసిడింగ్ లను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ఇందిరమ్మ రాజ్యంలో ఇల్లు లేని ఆదివాసి చెంచుల అందరికీ ఇల్లు మంజూరు చేస్తామన్నారు. అదేవిధంగా వారికి కావలసిన మౌలిక వసతులను అన్ని రకాలుగా అభివృద్ధి చేయడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రజా పాలన లక్ష్యం అన్నారు.

చెంచులకు  ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఇందిరా జల సౌర విద్యుత్ పథకాన్ని ప్రారంభించడం జరిగిందని గుర్తు చేశారు. ఆదివాసీలందరూ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు రామలింగ యాదవ్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఆనంద్,  నాయకులు చిన్న చంద్రయ్య, అధికారులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -